Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను మంచి ఆర్టిస్టును అవుతానని సావిత్రిగారు అప్పుడే చెప్పారు: సీనియర్ నటి ప్రభ

  • సావిత్రి నన్ను దగ్గరికి తీసుకున్నారు 
  • మంచి ఆర్టిస్టువు అవుతావు అన్నారు 
  • నా బుగ్గపై ముద్దిచ్చి వెళ్లారు
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ నటి ప్రభ మాట్లాడుతూ, సావిత్రిని గురించి ప్రస్తావించారు. "నా చిన్నప్పటి నుంచి నాకు సావిత్రి గారంటే చాలా ఇష్టం .. ఆమె నా ఆరాధ్య దైవం. చిన్నప్పుడు ఒక సినిమాలో ఒక రోల్ చేయడానికి నేను చెన్నై వెళ్లాను. చెన్నైలో ఏం చూస్తావని మా నాన్నగారు అడిగారు. నాకు సావిత్రి గారిని చూడాలని ఉందని చెప్పాను. దాంతో 'అడయార్'లోని సావిత్రిగారి ఇంటికి తీసుకెళ్లారు.

ఆ సమయంలో ఆమె హడావిడిగా షూటింగుకి బయలుదేరుతున్నారు. సావిత్రిగారిని చూడటానికి నేను 'తెనాలి' నుంచి వచ్చినట్టుగా ఆమె మేనేజర్ చెప్పారు.  వెంటనే ఆమె నన్ను దగ్గరికి తీసుకుని 'నేనంటే నీకు ఇష్టమా .. నా సినిమాలు చూస్తావా .. ఒక ఆర్టిస్టును ఇష్టపడ్డావంటే నీలో ఏదో వుంది .. నువ్ కూడా సినిమాల్లో చెయ్ బాగుంటుంది .. మంచి ఆర్టిస్టువు అవుతావు .. వెళ్లనా మరీ" అంటూ నా బుగ్గపై ముద్దు పెట్టుకుని వెళ్లిపోయారు. ఆ మహానటి ఎప్పటికీ బ్రతికే వుంటారు అని చెప్పుకొచ్చారు.   
prabha
ali

More Telugu News